వాంఖడే స్టేడియంలో జశస్వీ జైశ్వాల్.. ముంబై బౌలర్లను వేటాడాడు. 16 ఫోర్లు, 8 సిక్సర్లతో విరుచుకుపడి 124 పరుగులు చేశాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ 212 పరుగులు చేసింది.
ఓపెనర్ గా వచ్చిన జైశ్వాల్.. మొదటి బంతి నుంచే ముంబై బౌలర్లను చితక్కొట్టాడు. దాటిగా ఆడుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. పిల్లాడే పిడుగులా ఆడి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒక్కొ బంతి ఒక్కొ షాట్ ఆడుతూ.. అద్భుతమైన బ్యాటింగ్ ను కనబరిచాడు. రాజస్థాన్ బ్యాట్స్ మెన్స్ లో జైశ్వాల్ మినహా ఏ బ్యాట్స్ మెన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.
టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయ్యారు. ఓపెనర్ బట్లర్ (18, 19 బంతుల్లో) పరుగులు రాబట్టడానికి కష్టపడ్డాడు. కెప్టెన్ శాంసన్ (14, 10 బంతుల్లో) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. పడిక్కల్ (2, 4 బంతుల్లో), హోల్డర్ (11, 9 బంతుల్లో), హెట్ మేయర్ (8, 9బంతుల్లో), జురెల్ (2, 3 బంతుల్లో) నిరాశ పరిచారు. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. చావ్లా 2 వికెట్లు దక్కాయి. ఆర్చర్, మెరిడిత్ చెరో వికెట్ పడగొట్టారు.