ముంబై రంజీ జట్టులో యశస్వి జైస్వాల్‌‌‌‌

ముంబై రంజీ జట్టులో యశస్వి జైస్వాల్‌‌‌‌

ముంబై : విదర్భతో జరిగే రంజీ ట్రోఫీ సెమీస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ కోసం ముంబై జట్టును మరింత బలోపేతం చేశారు. ఇందుకోసం టీమిండియా ఓపెనర్‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నెల 17 నుంచి నాగ్‌‌‌‌పూర్‌‌‌‌లోని జామ్తాలో ఈ మ్యాచ్‌‌‌‌ జరగనుంది. క్వార్టర్స్‌‌‌‌లో 152 రన్స్‌‌‌‌ తేడాతో హర్యానాను ఓడించిన ముంబై ప్రస్తుతం మంచి ఫామ్‌‌‌‌లో ఉంది. 

గతవారం నాగ్‌‌‌‌పూర్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌పై తొలి వన్డే ఆడిన జైస్వాల్‌‌‌‌ 15 రన్స్‌‌‌‌ చేశాడు. శుక్రవారం అతను ముంబై టీమ్‌‌‌‌తో కలవనున్నాడు. చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ కోసం మొదట ప్రకటించిన ప్రొవిజినల్‌‌‌‌ జట్టులో జైస్వాల్‌‌‌‌కు చోటు దక్కింది. కానీ అనివార్య కారణాలతో అతన్ని నాన్‌‌‌‌ ట్రావెలింగ్ సబ్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌లో చేర్చారు.