హాంగ్జౌ: యశస్వి జైస్వాల్ (100) సెంచరీతో చెలరేగడంతో ఇండియా క్రికెట్ జట్టు ఆసియా గేమ్స్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో 23 రన్స్ తేడాతో నేపాల్‌పై గెలిచింది. టాస్ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 202/4 స్కోరు చేసింది. రింకూ సింగ్ (37 నాటౌట్), శివమ్ దూబే (25), రుతురాజ్ (25) రాణించారు. తర్వాత నేపాల్ 20 ఓవర్లలో 179/9 స్కోరుకే పరిమితమైంది. దీపేంద్ర సింగ్ (32) టాప్ స్కోరర్. కుశాల్ మల్ల (29), సుందీప్ జోరా (29) ఫర్వాలేదనిపించారు.