IND vs ENG 5th Test: కొత్త కింగ్: కోహ్లీ 8 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన జైస్వాల్

IND vs ENG 5th Test: కొత్త కింగ్: కోహ్లీ 8 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన జైస్వాల్

ధర్మశాల టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. గతేడాది వెస్టిండీస్ పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ ముంబై బ్యాటర్..ఆరు నెలల్లోనే తన టెస్ట్ కెరీర్ లో 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. డెబ్యూ టెస్టులోనే భారీ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిచ్చర పిడుగు తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇంగ్లాండ్ పై ఒక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా జైస్వాల్ రికార్డ్ సృష్టించాడు. 2016లో కోహ్లీ 655 పరుగులతో టాప్ లో ఉంటే తాజాగా జైస్వాల్ (712)తో ధర్మశాల టెస్టులో కోహ్లీ రికార్డ్ ను బ్రేక్ చేడు .  8 ఏళ్ళ కోహ్లీ రికార్డ్ జైస్వాల్ బ్రేక్ చేయడంతో జైస్వాల్ ను కొత్త కింగ్ గా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ గణాంకాలు చూసి నెటిజన్లు.. భారత క్రికెట్‌కు కోహ్లీ 'రాజైతే', ఇంగ్లాండ్‌పై అధిపత్యానికి జైస్వాల్ 'రాజ'ని కామెంట్లు చేస్తున్నారు. ఈ యువ కెరటం ఫామ్ చూస్తే మున్ముందు మరిన్ని రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మ్యాచ్ ద్వారా జైస్వాల్ కేవలం 16 ఇన్నింగ్స్ ల్లోనే 1000 పరుగుల మార్క్ చేరుకున్నాడు. దీంతో వేగంగా 1000 పరుగులు చేసిన రెండో భారతీయుడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లే పేరిట ఉంది. అతను 14 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో దుమ్ములేపుతున్న జైస్వాల్ ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో 58 బంతుల్లో 3 సిక్సులు, 5 ఫోర్లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు.   

ALSO READ :- ఈ ఆలయ మహిమ తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే... సూర్యుడితో పాటు త్రిశూలం కూడా తిరుగుతుంది..

  
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరించింది. తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఆలౌటైంది.  భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసుకొని ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతం వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (49) తో పాటు గిల్ (9) క్రీజ్ లో ఉన్నారు. 57 పరుగులు చేసిన జైస్వాల్ స్టంపౌటయ్యాడు.