Ranji Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి తప్పించారు: రంజీ ట్రోఫీలో టీమిండియా ఓపెనర్

Ranji Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి తప్పించారు: రంజీ ట్రోఫీలో టీమిండియా ఓపెనర్

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి ఆ తర్వాత తప్పించిన సంగతి తెలిసిందే. జైశ్వాల్ ను అసలు ఎందుకు ఎంపిక చేశారో ఎందుకు తప్పించారో ఎవరికీ అర్ధం కావట్లేదు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో విఫలమయ్యాడు. దీంతో ఈ యువ ఓపెనర్ పై వేటు పడింది. ఆ తర్వాత అనూహ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పించి సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చారు. దీంతో జైశ్వాల్ ను రంజీ ట్రోఫీకి ఎంపిక చేశారు. 

Also Read:-నేడే పాకిస్థాన్-న్యూజిలాండ్ ఫైనల్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

కీలకమైన సెమీ ఫైనల్ కు ముందు ముంబై సెలక్టర్లు గురువారం (ఫిబ్రవరి 13) ముంబై స్క్వాడ్ ను ఎంపిక చేశారు. విదర్భతో జరగబోయే ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ కు జైశ్వాల్ ను జట్టులోకి చేర్చారు. ఈ సీజన్ లో జైశ్వాల్ ఒకటే రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. జనవరి 23 న జమ్మూ కాశ్మీర్ తో జరిగిన ఈ మ్యాచ్ లో జైశ్వాల్ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 30 పరుగులే చేసి విఫలమయ్యాడు. జైశ్వాల్ రాకతో ముంబై మరింత పటిష్టంగా కనిపిస్తుంది. మంగళవారం కోల్‌కతాలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై జట్టు హర్యానాను 152 పరుగుల తేడాతో ఓడించి సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది. ఫిబ్రవరి 17న ముంబై, విదర్భ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

ముంబై జట్టు:

అజింక్య రహానే (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, అమోఘ్ భత్కల్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), సూర్యాంష్ ముత్ షెడ్గే, షార్దుల్ థక్ షెడ్గే, షార్దుల్ థక్‌లా అవస్తి, సిల్వెస్టర్ డిసౌజా, రాయిస్టన్ డయాస్, అథర్వ అంకోలేకర్, హర్ష్ తన్నా