DC vs RR: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సీన్ రిపీట్.. స్టార్క్ బౌలింగ్‌లో జైశ్వాల్ స్టన్నింగ్ సిక్సర్!

DC vs RR: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సీన్ రిపీట్.. స్టార్క్ బౌలింగ్‌లో జైశ్వాల్ స్టన్నింగ్ సిక్సర్!

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్, టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ మధ్య పోరు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హైలెట్ గా  మారింది. వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఆధిపత్యం చూపించుకోవడంతో వీరి మధ్య వార్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 లో స్టార్క్, జైశ్వాల్ మధ్య పోరు చూసే సమయం బుధవారం (ఏప్రిల్ 16)  ఫ్యాన్స్ కి కలిగింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని జైశ్వాల్ సిక్సర్ గా మలిచాడు. షార్ట్ ఆఫ్ లెంగ్త్ డెలివరీని మణికట్టు సహాయంతో జైశ్వాల్ డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ మీదుగా  చూడ చక్కని సిక్సర్ కొట్టాడు. టైమింగ్ తో పవర్ కూడా కలవడంతో ఏకంగా 95 మీటర్ల సిక్సర్ వెళ్ళింది. సరిగ్గా ఇలాంటి సిక్సర్ 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్టార్క్ బౌలింగ్ లో అచ్చం ఇలాగే సిక్సర్ కొట్టడం విశేషం. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్టార్క్ బౌలింగ్ లో డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ దిశగా సిక్సర్ కొట్టాడు. ఈ సిరీస్ లో మొదట స్టార్క్ పై జైశ్వాల్ ఆధిపత్యం చూపిన ఆ తర్వాత స్టార్క్ తన బౌలింగ్ తో జైశ్వాల్ పై గెలిచాడు. 

ఈ మ్యాచ్ లో పవర్ ప్లే లో హిట్టింగ్ తో అలరించిన జైశ్వాల్ ప్రస్తుతం 45 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. జైశ్వాల్ మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ విజయం దిశగా దూసుకెళ్తుంది. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. రాజస్థాన్ గెలవాలంటే చివరి 10 ఓవర్లలో 95 పరుగులు చేయాల్సి ఉంది. అంతకముందు మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.