ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. సిరీస్ మొత్తం పరుగుల వరద పారిస్తూ తనలోని నిలకడను చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్టుల్లో ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ ముంబై కుర్రాడు.. రెండు డబుల్ సెంచరీలతో 93.57 సగటుతో 655 పరుగులు చేశాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లలో 73 రెండో ఇన్నింగ్స్ లో 37 పరుగులు చేసి ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ స్థానాన్ని అందుకున్నాడు.
తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేయగా.. జైశ్వాల్ 12వ స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 2 పరుగులే చేయడంతో ఒక స్థానం దిగజారి 13 స్థానానికి పడిపోయాడు. జైశ్వాల్ ఖాతాలో 727 రేటింగ్ పాయింట్స్ ఉంటే. హిట్ మ్యాన్ కు 720 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (799) రాంచీ టెస్టులో సెంచరీ చేసి రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు.
ALSO READ :- మార్చి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్.... చిన్న వ్యాపారులకు ఇబ్బందే....
కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వ్యక్తిగత కారణాల వలన ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు దూరమైన కోహ్లీ, హ్యారీ బ్రూక్ టాప్ 10 అంచులో ఉన్నారు. 744 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ తొమ్మిదో స్థానంలో ఉండగా.. హ్యారీ బ్రూక్ 743 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా ప్రధమ స్థానంలో నిలిస్తే.. ఆస్ట్రేలియా నెంబర్ స్థానంలో కొనసాగుతుంది.
Yashasvi Jaiswal moves to number 12 in ICC Test batters ranking.
— Johns. (@CricCrazyJohns) February 28, 2024
- He is 2nd behind Virat Kohli among Indians, What a growth. 🫡 pic.twitter.com/Bo46JttI0C