RCB vs RR: RCBతో డూ ఆర్ డై మ్యాచ్.. సచిన్ రికార్డ్‌పై కన్నేసిన జైశ్వాల్

RCB vs RR: RCBతో డూ ఆర్ డై మ్యాచ్.. సచిన్ రికార్డ్‌పై కన్నేసిన జైశ్వాల్

ఐపీఎల్ లో గురువారం (ఏప్రిల్ 24) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ రాజస్థాన్ కు చావో రేవో లాంటిది. ఓడిపోతే ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. ఈ కీలక మ్యాచ్ లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఒక అరుదైన మైల్ స్టోన్ న చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏకంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ పై కన్నేసాడు. ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

జైశ్వాల్ ఐపీఎల్ కెరీర్ లో అతి తక్కువ సమయంలోనే ఐపీఎల్ లో చాలా రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు ఐపీఎల్ కెరీర్ లో 60 ఇన్నింగ్స్‌ల్లో 1914 పరుగులు చేశాడు. ఈ మెగా టోర్నీలో మరో 86 పరుగులు చేస్తే 2000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. మరో రెండు ఇన్నింగ్స్ ల్లో 86 పరుగులు చేస్తే సచిన్ ను అధిగమించి ఐపీఎల్ లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఫాస్టెస్ట్ ఇండియన్ బ్యాటర్ గా నిలుస్తాడు. 63 ఇన్నింగ్స్ ల్లో సచిన్ 2000 ఐపీఎల్ పరుగుల మార్క్ అందుకున్నాడు. 2012లో టెండూల్కర్ 63 ఇన్నింగ్స్‌లలో ఈ క్యాష్-రిచ్ లీగ్‌లో 2000 పరుగులు పూర్తి చేశాడు. 

Also Read:-పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచులు అన్నీ రద్దు : ఎక్కడా కూడా ఆడేది లేదు

భారత ఆటగాళ్లలో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు. ఈ చెన్నై కెప్టెన్ కేవలం 57 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. రెండో స్థానంలో కేఎల్ రాహుల్ (60) ఉన్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 8 ఇన్నింగ్స్ ల్లో 307 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో 9 స్థానంలో ఉన్నాడు.