Yashasvi Jaiswal: జట్టు నుంచి తప్పించారనే బాధ.. రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్న జైస్వాల్

Yashasvi Jaiswal: జట్టు నుంచి తప్పించారనే బాధ.. రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్న జైస్వాల్

రంజీ ట్రోఫీ సెమీఫైనల్ రేసు నుంచి భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ తప్పుకున్నాడు. సోమవారం నుంచి విదర్భ, ముంబై జట్ల మధ్య నాగ్‌పూర్‌ వేదికగా సెమీఫైనల్ ప్రారంభం కానుండగా.. జైస్వాల్ చివరి నిమిషంలో వైదొలిగాడు. చీలమండ గాయం కారణంగా అతను వైదొలగాడని వార్తలు వస్తున్నప్పటికీ, ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తప్పించడమే అసలు కారణమని నివేదికలు చెప్తున్నాయి. 

మొన్నటివరకూ జైస్వాల్ భారత ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో సభ్యుడు. రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ కాకుండా మూడో ఓపెనర్‌గా జైస్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లలో వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన కనపరచడంతో చివరి నిమిషంలో అతన్ని జట్టులోకి చేర్చారు. దాంతో, తుది జట్టులో స్థానం కోల్పోయిన భారత ఓపెనర్ నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లో చోటు దక్కించుకున్నారు.

రహానే, సూరీడు, దూబే..

జైస్వాల్ లేనప్పటికీ, ముంబై జట్టుకొచ్చిన నష్టం ఏమీ లేదు. కెప్టెన్ అజింక్య రహానే, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, శార్దూల్ ఠాకూర్ రూపంలో అంతర్జాతీయ స్టార్లకు కొదవలేదు. ఒకవేళ జట్టులో స్టార్లు ఉన్నా.. వారు రాణిస్తుంది లేదు. ముంబై లోయర్ ఆర్డర్ బ్యాటర్లే నిలకడగా ఆడుతున్నారు. కావున జైస్వాల్ స్థానంలో మరొకరిని ప్రకటించే అవకాశం లేదు.

ALSO READ | ఆ ముగ్గురిని ఎదుర్కోవడం కష్టం.. టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ: ఆసీస్ మాజీ కెప్టెన్

డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై, క్వార్టర్ ఫైనల్లో హర్యానాను ఓడించి సెమీఫైనల్‌ చేరుకుంది.

రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌కు ముంబై జట్టు:

అజింక్య రహానే (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, అమోఘ్ భత్కల్, సూర్యకుమార్ యాదవ్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), సూర్యాంశ్ షెడ్జే, శార్దూల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుష్ కొటియన్, మోహిత్ అవాస్థి, సిల్వస్టర్ డిసౌజా, రాయ్‌స్టన్ డియాస్, అథర్వ అంకోలేకర్, హర్ష్ తన్నా.