బోర్డర్ గవాస్కర్ సిరీస్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. చేతి వేలి గాయం కారణంగా యువ బ్యాటర్ శుభమాన్ గిల్ తొలి టెస్టు ఆడట్లేదు. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తన ఫిట్ నెస్ నిరూపించుకునే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరో గాయం భారత్ ను ఆందోళనకు గురి చేస్తుంది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు.
మంగళవారం (నవంబర్ 19) ప్రాక్టీస్ సెషన్‌లో జైశ్వాల్ కొంత అసౌకర్యానికి గురయ్యాడు. అతను మెడ నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. నివేదికల ప్రకారం.. జట్టు ఫిజియో అతనికి వైద్యం అందించిన తర్వాత దాదాపు 35 నిమిషాల పాటు ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ కొనసాగించాడు. జైశ్వాల్ కు ఇది మొదటి ఆస్ట్రేలియా పర్యటన. గత ఏడాది వెస్టిండీస్‌లో తన టెస్ట్ కెరీర్ ఆరంభించి దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు 14 మ్యాచ్‌ల్లో 56.28 సగటుతో 1407 పరుగులు చేశాడు. వీటిలో మూడు సెంచరీలు ఉన్నాయి.
Also Read : ఇండియా టాపార్డర్ బ్యాటర్ షెఫాలీపై వేటు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ నవంబర్ 22 నుంచి తొలి టెస్ట్ ఆడనుంది. పెర్త్ వేదికగా జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ కు భారీ హైప్ నెలకొంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు వెళ్లాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు అత్యంత కీలకం. ఈ టెస్ట్ మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ బుమ్రా దూరం కావడంతో అతని స్థానంలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా భారత్ కు నాయకత్వం వహిస్తాడు.
Another troubling news for Team India? 👀
— OneCricket (@OneCricketApp) November 19, 2024
Yashasvi Jaiswal looked a bit uncomfortable during practice session 🤕
📸: X #AUSvIND #YashasviJaiswal #BGT pic.twitter.com/HRq4ik3IuQ