
టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో అతను ఇకపై ముంబైగా తరపున కాకుండా గోవా జట్టుకు ఆడనున్నట్టు సమాచారం. వచ్చే సీజన్ కోసం తనను ముంబై నుంచి గోవాకు మార్చాలని జైశ్వాల్ ముంబై క్రికెట్ అసోసియేషన్ ఈ-మెయిల్ రాసినట్లు తెలుస్తోంది. ఈ-మెయిల్ లో తనకు NOC (నో అబ్జక్షన్ సర్టిఫికెట్) ఇవ్వాలని జైశ్వాల్ కోరాడట. " జైశ్వాల్ మా నుండి NOC కోరాడు.
" జైశ్వాల్ మా నుండి NOC కోరాడు. వ్యక్తిగత కారణాల వలన అతను గోవాకు మారాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు". అని ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు ధృవీకరించాయి. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించడం సహజం. గతంలో ముంబై జట్టులో క్రమం తప్పకుండా చోటు దొరకని ఆటగాళ్లు వేరే రాష్ట్రం తరపున ఆడేవారు. కానీ జైశ్వాల్ స్టార్ బ్యాటర్. అతను భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్. ముంబై జట్టులో అతనికి ఖచ్చితంగా చోటు ఉంటుంది. అయినప్పటికీ గోవాకు ఆడాలనుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Also Read:-పాత ఒప్పందం ప్రకారమే ముందుకెళ్తాం.. సన్ రైజర్స్, హెచ్‌సీఏ ప్రకటన
అర్జున్ టెండూల్కర్, సిద్ధేష్ లాడ్ ముంబై జట్టులో చోటు దక్కకపోవడంతో వీరు గోవా తరపున ఆడుతున్నారు. తాజాగా వీరితో పాటు జైశ్వాల్ కూడా గోవా జట్టులో చేరనున్నాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున జైశ్వాల్ 19 టెస్టుల్లో అతను 52.88 సగటుతో 1798 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు.. 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతను ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 మ్యాచ్‌ల్లో 43.44 సగటుతో 391 పరుగులు చేసి రాణించాడు.
🚨 JAISWAL QUITS MUMBAI. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2025
- Yashasvi Jaiswal has decided to change his state team from Mumbai to Goa. (Express Sports). pic.twitter.com/NSX5HvH8hC