నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి : యశస్విని రెడ్డి

నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి :  యశస్విని రెడ్డి
  • సీఎంను కలిసి కోరిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 

తొర్రూరు, వెలుగు: పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కోరారు. హైదరాబాద్ లోని సీఎం క్యాంపు ఆఫీసులో రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి ఝాన్సీ రెడ్డి కలిశారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధుల ద్వారా రూ.50 కోట్ల మేర నిధులు కేటాయించాలని సీఎం కోరారు. రోడ్ల విస్తరణ, డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాలు, పార్కులు, నీటి సరఫరా ఇతర మౌలిక అవసరాల కోసం ఈ నిధులు అత్యవసరమని వివరించారు. 

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సీఎం ని కలిసిన వారిలో వరంగల్ మాజీ జడ్పీ చైర్మన్ లకవత్ ధన్వంతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు డా. లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు.