కొత్తదనం కోరుకునే వారికి యశోద నచ్చుతది

కొత్తదనం కోరుకునే వారికి యశోద నచ్చుతది

టాలీవుడ్ లో తనకంటూ ఓ ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసుకున్న సమంత.. డిఫెరెంట్ మూవీస్ చేస్తూ ప్రేక్షకుల మదిని దోచుకుంటోంది. అందంతో పాటు తన నటనతోనూ ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కొంతకాలంగా మయోసైటీస్ తో భాదపడ్తూ.. ట్రీట్మెంట్ టైమ్ లోనే భారీ బడ్జెట్ మూవీ అయిన యశోదని పూర్తి చేసింది సామ్. ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో అభిమానుల్లో మరింత హైప్ ని క్రియేట్ చేసింది కూడా. సరోగసి నేపథ్యంలో వచ్చి న ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా.? సమంత ఎలా యాక్ట్ చేసిందో  చూద్దాం.



తమతమ జీవితాల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు పేదింటి అమ్మాయిలు. అలాంటి వారికి డబ్బు ఆశచూపించి సరోగసి తల్లులుగా మార్చి, పిల్లలు కనలేని ధనవంతుల కోరికలు తీర్చే యంత్రాలుగా మారుస్తుంటుంది మెడికల్ మాఫియా. ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో జరుగుతున్న మోసాలు, సరోగసి ద్వారా తల్లులుగా  మారిన అమ్మాయిలు ఏం చేస్తున్నారు? యశోదగా సమంత ఛేదించిన భయంకమైన నిజం ఏంటి? అందపెద్ద మాఫియాని యశోద ఒక్కతే ఎలా ఎదుర్కొంది అన్నదే ఈ సినిమా.

యశోద మూవీ స్టార్టింగ్ లో కాస్త స్లో గా అనిపించినా... ప్రేక్షకుల దృష్టిని మరల్చకుండా డైరెక్టర్లిద్దరూ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు ఇరవై నిమిషాలు.. ఆడియన్స్ ని వేరే లెవల్ కి తీసుకెళ్తుంది. క్రైమ్, థ్రిల్లర్ కి సస్పెన్స్ జోడించడమే కాకుండా... ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో ఎమెషనల్ సీన్స్ ని చక్కగా చూపించారు. మూవీని చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదు. అంత ఆసక్తికరంగా ఉంటుంది స్క్రీన్ ప్లే. 



ఇక మయోసైటీస్ తో భాదపడ్తున్న సమంత... తన యాక్టింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎమోషనల్ సీన్స్ తో పాటు... సెకండ్ హాఫ్ ఫైట్స్ సీన్స్ ను అంతే అద్భుతంగా చేసింది సామ్. నెగటీవ్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటన మరో హైలెట్. ఉన్ని ముకుందన్, సంపత్, రావు రమేష్, మురళి శర్మలు తమ పాత్రలకు న్యాయం చేశారు. సుకుమార్ సినిమాటోగ్రపీ కూడా బాగుంది. మూవీలో ఇవన్నీ ఒకెత్తైతే.. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో హైలెట్. ఆడియన్స్ కి గూస్ బంప్స్ ని తెప్పిస్తుంటది. యాక్షన్, థ్రిల్లింగ్ కథలతో పాటు... కొత్త తరహా సినిమాలని చూడాలనుకునే వారికిది బాగా నచ్చుద్ది.