అవయవ మార్పిడి సర్జరీల కేంద్రంగా సిటీ

అవయవ మార్పిడి సర్జరీల కేంద్రంగా సిటీ
  • యశోదా ఆస్పత్రి డైరెక్టర్​ డాక్టర్​ పవన్​ గోరుకంటి
  • 35 మందికిపైగా పేషెంట్లతో ఆత్మీయ సమ్మేళనం

సికింద్రాబాద్, వెలుగు : అవయవదానంతో వేరొకరికి కొత్త జీవితం లభిస్తుందని యశోద హాస్పిటల్స్​డైరెక్టర్ డాక్టర్​పవన్​ గోరుకంటి తెలిపారు. అవయవమార్పిడి సర్జరీల నిర్వహణ కేంద్రంగా హైదరాబాద్ దేశంలోనే ప్రధానంగా మారిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ లో విజయవంతంగా గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్ మార్పిడి చేసుకుని పునర్జన్మ పొందిన 35 మందికిపైగా పేషెంట్లతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అవసరమైన అవయవాలు లభించక ఏటా 3 లక్షల మందికిపైగా మరణిస్తున్నారన్నారు. రాష్ట్రంలో  ఆశాజనకంగా ఉందని, దేశంలోనే అత్యధికంగా ప్రతి పది లక్షల జనాభాకు 5 మంది వరకు అవయవదానం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన ‘జీవన్ దాన్’తో అవయవదానాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని చెప్పారు.

అవయవదానాలు పెంచటమే కాకుండా, అపోహలను తొలగించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్ హెడ్ డాక్టర్. విజయ్ కుమార్ మాట్లాడుతూ అనేక మంది రోగులు యశోద హాస్పిటల్స్ లోని  ఇన్ స్టిట్యూట్ఆఫ్ హార్ట్ , లంగ్ ట్రాన్స్ ప్లాంట్ లో థొరాసిక్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ తో సరికొత్త జీవితం పొందారన్నారు.