అవయవదానంతో సరికొత్త జీవితం

అవయవదానంతో సరికొత్త జీవితం

హైదరాబాద్, వెలుగు:   అవయవ మార్పిడి ప్రాధాన్యత, దీనిపై ఉన్న అపోహలను తొలగించడానికి యశోద హాస్పిటల్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్​ హైటెక్ సిటీ బ్రాంచీలో చేయూత ఫౌండేషన్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ ‌‌‌‌ప్లాంట్స్, కేర్ ఫర్ యువర్ కిడ్నీ ఫౌండేషన్, కిడ్నీ వారియర్స్ ఫౌండేషన్ సహకారంతో “సెలబ్రేటింగ్ సెకండ్ ఛాన్సెస్ – లైఫ్ విత్ కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్ పేషెంట్స్” పేరిట ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ నెఫ్రాలజిస్ట్ & కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, నివారణ వ్యూహాల గురించి వివరించారు. 

యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జీఎస్​రావు మాట్లాడుతూ... తమ హాస్పిటల్స్ ‌‌‌‌లో అధునాతన టెక్నాలజీ,  బహుళ వైద్య విభాగాల ద్వారా ప్రపంచ స్థాయి మూత్రపిండాల సంరక్షణను అందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​కు చెందిన 280 మంది కిడ్నీ మార్పిడి గ్రహీతలు, డయాలసిస్ రోగులు, కిడ్నీ దాతలు,  టెక్నీషియన్లు పాల్గొన్నారు.