ఐబీడీ పేగు వ్యాధిపై యశోద హాస్పిటల్స్ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌

ఐబీడీ పేగు వ్యాధిపై యశోద హాస్పిటల్స్ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: యశోద హాస్పిటల్స్ హైటెక్- సిటీలో  ‘అంతర్జాతీయ కాన్ఫరెన్స్  అండ్  లైవ్ వర్క్ షాప్’ ను ఆదివారం నిర్వహించింది. ఇందులో ‘ఐబీడీ– (ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లమేటరీ బోవేల్ డిసీజ్)’ చికిత్సలో అందుబాటులోకి వచ్చిన పురోగతులపై  చర్చించారు.  ఈ కార్యక్రమంలో గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా 300 మందికి పైగా జాతీయ,  అంతర్జాతీయ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ జీఎస్‌‌‌‌‌‌‌‌ రావు మాట్లాడుతూ... నాణ్యమైన వైద్యం అందించేందుకు యశోద హాస్పిటల్స్ ఇలాంటి అంతర్జాతీయ సదస్సు‌‌‌‌‌‌‌‌ను నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఐబీడీ  ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలోని దక్షిణాన వేగంగా పెరుగుతున్న ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లమేటరీ పేగు వ్యాధి అని పేర్కొన్నారు.  గత దశాబ్ద కాలంలో ఇండియాలో  ఐబీడీ కేసులు గణనీయంగా పెరిగాయన్నారు.