
పద్మారావునగర్, వెలుగు: బ్రెయిన్ ట్యూమర్ సర్జరీల కోసం ప్రస్తుతం అత్యంత అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు తెలిపారు. న్యూరో ఎండోస్కోపీ స్కల్ బేస్ సర్జరీ ఇందుకు కారణమన్నారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ లో నిర్వహిస్తున్న ‘స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్-2025’ రెండు రోజుల ఇంటర్నేషనల్ సమ్మిట్, లైవ్ వర్క్ షాప్‌ను శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా ప్రారంభించారు.
అలాగే యశోద హాస్పిటల్స్లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీల కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక రోబోటిక్ సర్జరీ, ప్రపంచ స్థాయి న్యూరో ఎండోస్కోపీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను ప్రారంభించారు. హాస్పిటల్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ అయ్యదురై మాట్లాడుతూ.. ఈ సమ్మిట్ దేశంలోనే న్యూరో సర్జరీ రంగంలో నిర్వహిస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు అని తెలిపారు. సదస్సులో యశోద హాస్పిటల్స్ యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్, 500 మందికి పైగా న్యూరో సర్జన్లు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రఖ్యాత న్యూరో వైద్య నిపుణులు పాల్గొన్నారు.