లంగ్ క్యానర్‌‌‌‌పై యశోద హాస్పిటల్స్‌‌ సదస్సు

లంగ్ క్యానర్‌‌‌‌పై యశోద హాస్పిటల్స్‌‌ సదస్సు

హైదరాబాద్, వెలుగు:  యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఇబస్ (ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్),  లంగ్ క్యాన్సర్లపై  అంతర్జాతీయ శిక్షణ సదస్సు, లైవ్ వర్క్ షాప్‌‌ను ఆదివారం ప్రారంభించింది. 

 సంస్థ ఎండీ  జి. ఎస్. రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  లంగ్ క్యాన్సర్ వ్యాధి నిర్దారణ,  చికిత్స ప్రక్రియలకు సంబంధించి ఈ సదస్సులో  ‘ఇబస్ - మాస్టర్ క్లాస్’ పేరిట పల్మనాలజిస్టుల (శ్వాసకోశవ్యాధుల నిపుణుల)కు శిక్షణ ఇవ్వనున్నారు.   ఈ శిక్షణా కార్యక్రమంలో 500 మందికి పైగా పల్మనాలజిస్టులు పాల్గొంటారని అంచనా.   లంగ్ క్యాన్సర్ చికిత్సలో అధునాతన విధానాల గురించి వీరు నేర్చుకుంటారు.