
హైదరాబాద్, వెలుగు : బ్రాంకస్ 2025’ పేరుతో అంతర్జాతీయ పల్మొనాలజీ సదస్సు, లైవ్ వర్క్ షాప్‌ను యశోద హాస్పిటల్స్ నిర్వహించింది. ఇందులో 60 మందికి పైగా అంతర్జాతీయ అధ్యాపకులు, 150మందికి పైగా జాతీయ అధ్యాపకులు, 3,000 కంటే ఎక్కువ మంది పల్మొనాలజీ వైద్యులు ఇంటర్వెన్షనల్ పల్మొనాలజీ సదస్సులో పాల్గొన్నారు. వరుసగా నాలుగోసారి యశోద గ్రూప్ ఈ సదస్సును సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది.
రెండు రోజుల పాటు జరిగిన సదస్సు, లైవ్ వర్క్ షాప్‌లో రెండో రోజు ముఖ్య అతిధిగా యశోద గ్రూప్ హాస్పిటల్స్ ఎండీ జీఎస్ రావు పాల్గొన్నారు. ఊపిరితిత్తుల వైద్య విభాగంలో, వైద్య విజ్ఞాన శాస్త్రంలో నెలకొన్న సరికొత్త ఆవిష్కరణలపై తాజా సదస్సులో చర్చించారు.