CK Nayudu Trophy: చరిత్ర సృష్టించిన యశ్వర్ధన్ దలాల్.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు

CK Nayudu Trophy: చరిత్ర సృష్టించిన యశ్వర్ధన్ దలాల్.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు

హర్యానా ఓపెనర్ యశ్వర్ధన్ దలాల్ కల్నల్ సికె నాయుడు ట్రోఫీ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ తో మెరిశాడు. ఏకంగా క్వాడ్రపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ టోర్నమెంట్ చరిత్రలో 400 పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా తన ఖాతాలో రికార్డ్ అరుదైన వేసుకున్నాడు. శనివారం (నవంబర్ 9)  సుల్తాన్‌పూర్‌లోని గురుగ్రామ్ క్రికెట్ గ్రౌండ్ లో ముంబైతో జరిగిన మ్యాచ్ లో అతను 463 బంతుల్లో 426 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 46 ఫోర్లతో పాటు..12 సిక్సర్లున్నాయి. 

కల్నల్ సికె నాయుడు ట్రోఫీలో ఇప్పటివరకు 312 పరుగులు చేసి అగ్ర స్థానంలో ఉన్న సమీర్ రిజ్వీ (ఉత్తరప్రదేశ్) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజ్వీ ట్రిపుల్ సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్ గా రికార్డ్ సృష్టించగా.. 9 నెలల వ్యవధిలోనే దయాళ్ ట్రిపుల్ సెంచరీ రికార్డ్ బ్రేక్ చేయడంతో పాటు ఏకంగా నాలు వందల పరుగుల మార్క్ అందుకున్నాడు.  దలాల్ ధాటిగా ఆడడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి హర్యానా ఎనిమిది వికెట్ల నష్టానికి 732 పరుగుల భారీ స్కోరును సాధించింది. 

తొలి వికెట్ కు రంగా (151) తో కలిసి 410 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. హర్యానా 4.16 రన్-రేట్‌తో పరుగులను చేయడం విశేషం. 
దయాల్ మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించనున్నాడు. ఇదే జోరును కొనసాగిస్తే అతను 500 పరుగుల మార్క్ అందుకోవడం కష్టం కాకపోవచ్చు.