Yashwant Reddy, Shobha Shetty Engagement: ఘనంగా జరిగిన శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డిల నిశ్చితార్థం

బుల్లితెర నటి శోభా శెట్టి(Shobha Shetty) ఎంగేజ్మెంట్ జరిగింది. తన ప్రియుడు యశ్వంత్ రెడ్డి(Yashwant Reddy)తో ఇరు కుటుంబసభ్యుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. అయితే.. ఇక్కడ విశేషం ఏంటంటే వీరి నిశ్చితార్థం జనవరిలోనే జరుగగా..దానికి సంబందించిన ఫోటోలను ఏ మధ్యే సోషల్ మీడియాకి షేర్ చేశారు ఈ జంట. దాంతో ఆ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. అవి చూసిన నెటిజన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.       

ఇక శోభా శెట్టి విషయానికి వస్తే.. కర్ణాటకకు చెందిన ఈ నటి కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సీరియల్ లో మోనిత గా ఆమె పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ పాత్ర ఆమె తప్ప వేరే ఎవరూ చేయలేరు అనేంతగా  అలరించింది. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టింది. అక్కడ బిగ్ బాస్ దత్త పుత్రికగా పేరుతెచ్చుకున్న ఆమె..  టాప్ సిక్స్ వరకు వెళ్లి వెనుదిరిగింది.