రజాకార్ (Razakar) అనే ఒక విప్లవ పదం వెనుక తెలంగాణ సాయుధ పోరాట గాథలెన్నో కనిపిస్తాయి. ఇక కనిపించని మరెన్నో వెతలను, సామాన్యులు అనుభవించిన వేదనలను చూపించడానికి వస్తున్న మూవీ రజాకార్(Razakar) . ఇప్పుడు తెలంగాణ చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం అంటూ రైటర్.. డైరెక్టర్ యాట సత్య నారాయణ రజాకార్ మూవీను తెరకెక్కిస్తున్నారు.
లేటెస్ట్గా రజాకార్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ 1948 మధ్య కాలంలో ఇండియన్ యూనియన్ లో చేరడానికి ముందు నిజాం హైదరాబాద్లో జరిగిన సంఘటనల బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వాళ్ళు ఇక్కడ మతమైనా మారాలి..లేదా రాజ్యమైన వదలాలి..అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. యుద్ధం చేయాల్సిందే..ఆ మతోన్మాదులను కతం చేయాల్సిందే, చర్చలు లేవు..సందీ లేదు..యుద్ధం జరగాల్సిందే వంటి డైలాగ్స్ ట్రైలర్ పై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ టీజర్ లో తుపాకీ చివర అంచున ఒక రజాకారుడి మరణం..పాఠాలు బోధించే మాస్టారు రోదన .హైద్రాబాద్ మారణ హోమం..చుట్టూ పోలీసులు..కాళ్ళను పట్టుకుని ప్రాధేయపడే అమాయకపు జనాలు..ఇలా ప్రతిదీ రజాకార్ మూవీపై ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి.
తెలంగాణ బిడ్డ మన తెలంగాణ మూలాలు, అనుభవించిన దురవస్థలు తెలుసుకోవడం ఈ సినిమా నేపధ్యం అని డైరెక్టర్ తెలిపారు. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే నటీనటులుగా సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని గూడూరు సత్యనారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా మార్చి 1న ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ కానుంది .