యాత్ర 2 ఫస్ట్ లుక్ వచ్చేసింది.. జ‌గ‌న్ పాత్ర‌లో ఆకట్టుకుంటున్న హీరో జీవా

2009 ఎన్నికల నేపథ్యంలో దివంగతనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి(YS Rajashekhara reddy) చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ యాత్ర(Yatra). 2019లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ గా యాత్ర2(Yatra2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి(Mammootty), వైఎస్‌ జగన్‌(YS Jagan) పాత్రలో తమిళ హీరో జీవా(Jeeva) నటిస్తున్నారు. మహి వి రాఘవ్(Mahi v raghav) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా నుండి వై.ఎస్.రాజశేఖర రెడ్డి, వై.ఎస్.జగన్‌ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో మ‌మ్ముట్టి, జీవా ఇన్‌టెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి...నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని అనే డైలాగ్‌ను పోస్ట‌ర్‌లో యాడ్ చేశారు. 

ఇక మొదటి పార్ట్ లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర గురించి చూపించిన దర్శకుడు.. యాత్ర 2లో.. వైఎస్ జగన్ ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరు, 2009-2019 మధ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనలను చూపించనున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే..  యాత్ర చిత్రాన్ని 2019లో ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు యాత్ర 2ను కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు.. సంతోష్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.