Yatra 2 Movie X Review: యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ..ఎమోషన్తో కదిలించే జగనుడి జైత్ర యాత్ర

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్ జర్నీ, పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర నేపథ్యంలో యాత్ర 2 (Yatra 2) మూవీ తెరకెక్కింది. డైరెక్టర్ మహి వి రాఘవ్(Mahi V Raghav) తెరకెక్కించిన ఈ మూవీ ఇవాళ (ఫిబ్రవరి 8న) థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాల వైస్సార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదల కోసం, వికలాంగుల కోసం, ప్రతి వ్యక్తి ఆరోగ్య సంరక్షణ కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని చెప్పే ఉద్దేశంలో తీసిన యాత్ర మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. 

యాత్ర 2 మూవీకి ట్విట్టర్ ఎక్స్‌లో ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్‌ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ మరణాంతరం తనయుడు జగన్..తండ్రికి ఇచ్చిన మాట కోసం చేసిన పాదయాత్రకు ఎంత మంది ఆయన వెనకాల నిలిచారు అనేది డైరెక్టర్ మహి వి రాఘవ్ చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుందని ట్విట్టర్ వేదికగా సినీ అభిమానులు..వైస్సార్ అభిమానులు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

యాత్ర 2 సినిమాలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ జీవితాన్ని డైరెక్ట‌ర్‌ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా..ఎమోష‌న‌ల్‌గా చూపించాడ‌ని సోషల్ మీడియాలో నెటిజ‌న్లు వరుస ట్వీట్స్ చేస్తున్నారు. జ‌గ‌న్ పాత్ర‌లో నటించిన జీవా పూర్తిగా న్యాయం చేశాడ‌ని, త‌న డైలాగ్స్ మేన‌రిజ‌మ్స్‌, బాడీలాంగ్వేజ్‌తో చాలా చోట్ల జ‌గ‌న్‌ను జీవా గుర్తుచేశాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు. జ‌గ‌న్ జీవితంలోని పాదయాత్ర సమయంలో కీల‌క ఘ‌ట్టాల‌ను చాటిచెబుతూ వ‌చ్చే డైలాగ్స్ థియేటర్లో అదిరిపోయాయని..కన్నీళ్లు తెప్పించాయని నెటిజన్స్ అభిప్రాయం తెలుపుతున్నారు. 

కడపోడు సార్ కడపోళ్ళకి ఈ ఎండలు కష్టాలు కొత్త ఏమీకాదుస్వతహాగా దేనిని అయినా ఓర్చుకునే శక్తి వాళ్ళకి ఎక్కువ‌...పిల్లిని తీసుకెళ్లి అడ‌విలో వ‌దిలిన అది పిల్లే సార్‌...పులిని తీసుకొచ్చి బోనులో పెట్టిన అది పులే అంటూ వ‌చ్చే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ థియేట‌ర్ల‌లో విజిల్స్ వేయిస్తాయ‌ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో చాలా చోట్ల డైరెక్టర్ మ‌హి వి రాఘ‌వ్ ఏడిపించేశాడ‌ని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లో యాత్ర 2 మూవీ బెస్ట్‌ బయోపిక్‌ అని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు.సినిమాలో ప్రతి ఒక్కరినీ కదిలించే ఎమోషనల్‌ సీన్స్‌ ఉన్నాయట. ఈ సినిమాలో నటించిన వారి నటనకు, జగన్ పాత్రలో చేసిన జీవా నటనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయంటూ నెటిజన్స్‌ ఎక్స్‌లో కామెంట్‌ చేస్తున్నారు.

ఈ సినిమా చుసిన నెటిజన్ కామెంట్ చేస్తూ..యాత్ర 2 మూవీ బెస్ట్‌ బయోపిక్‌. సినిమా స్టార్టింగ్‌ నుంచే ఆడియన్స్కు గూస్‌ బంప్స్‌ వచ్చేలా తెరకెక్కించాడు డైరెక్టర్ మహి వి. రాఘవ్‌. ఇంతకు ముందు జగన్‌పై ఎక్కడో కొంచెం ద్వేషం ఉండే..ఇక ఈ సినిమా చూశాక అది ఎప్పటికీ చెరగని ప్రేమలా మారింది. వైఎస్‌ జగన్‌ని ద్వేషించేవారికి కూడా యాత్ర 2 మూవీ గూస్‌ బంప్స్‌ వచ్చే మూమెంట్స్‌ సినిమా ఎండింగ్ వరకు ఉన్నాయంటూ అభిప్రాయాన్ని పంచుకున్నాడు. 

మరో నెటిజన్ యాత్ర 2 సినిమా చూశాక..ఎమోషనల్ అవుతూ..నిజాయితీగా మనసులో మాట చెబుతున్న..తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లో యాత్ర 2 బెస్ట్‌ బయోపిక్‌.ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. బొమ్మ అదిరింది జగనుడి పాదయాత్ర నన్ను కదిలించింది..అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

యాత్ర-2 మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థియేటర్‌లో ప్రతి ప్రేక్షకుడు భావోద్వేగానికి గురయ్యారు. యాత్ర 2 కథనం..జగనుడి జైత్ర యాత్ర ఎలా సాగిందో మరి కాసేపట్లో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.