
ఏపీలో ఎన్నికల నగార మోగేందుకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలలో గుబులు మొదలైంది. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనేదాని తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా 175కు 175 గెలవాలని వైసీపీ పార్టీ తీవ్రంగా పని చేస్తుంది. ఈ క్రమంలోనే అధికార వైసీపీ పార్టీ ఇంచార్జ్ల నియమక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇది వరకే మొదటి జాబితా ప్రకటించిన వైసీపీ.. జనవరి 2వ తేదీ రాత్రి రెండో జాబితా ప్రకటించింది. మొత్తం 27 మంది పేర్లతో ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
రెండో జాబితాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వారి వారసులకు ఇంచార్జ్ల పోస్టులు దక్కాయి. ఎంపీలకూ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు.
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ - రాజమండ్రి రూరల్
తెల్లం రాజ్యలక్ష్మి - పోలవరం (ఎస్టీ)
బీ ఎన్ మక్బుల్ అహ్మద్ కదిరి
తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం (ఎస్పీ)
మాచాని వెంకటేష్ - ఎమ్మిగనూరు
భూమన అభినయ్ రెడ్డి - తిరుపతి
షేక్ సూరి ఫాలిమా - గుంటూరు ఈస్ట్
పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) - మచిలీపట్నం
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి - చంద్రగిరి
కే.వీ. ఉషా శ్రీచరణ్ పెనుకొండ
శ్రీ తలారి రంగయ్య - కళ్యాణదుర్గం
గొడ్డేటి మాధవి - అరకు (ఎస్టీ)
మత్స్యరాస విశ్వేశ్వర రాజు - పాడేరు (ఎస్టీ)
వెలంపల్లి శ్రీనివాస రావు - విజయవాడ సెంట్రల్
షేక్ ఆసిఫ్ - విజయవాడ వెస్ట్
మాలగుండ్ల శంకరనారాయణ - అనంతపురం ఎంపీ
జోలదరాశి శాంత - హిందూపురం ఎంపీ
కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి - అరకు ఎంపీ (ఎస్టీ)
డా! తాలె రాజేష్ - రాజాం (ఎస్సీ)
మలసాల భరత్ కుమార్ - అనకాపల్లి
శ్రీ కంబాల జోగులు - పాయకరావుపేట (ఎస్సీ)
పిల్లి సూర్యప్రకాష్ - రామచంద్రాపురం
విప్పర్తి వేణుగోపాల్ - పి.గన్నవరం (ఎస్సీ)
పిఠాపురం - వంగ గీత
తోట నరసింహం - జగ్గంపేట
వరుపుల సుబ్బారావు - ప్రత్తిపాడు
మార్గాని భరత్ - రాజమండ్రి సిటీ