ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. దీంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీ ఎత్తున కటౌట్లు, అభిషేకాలు అంటూ హంగామా శురూ చేశారు. అయితే అల్లు అర్జున్ కోసం నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి కూడా సోషల్ మీడియాద్వారా స్పందించాడు. ఇందులోభాగంగా ఫైర్ ఏమోజీస్ షేర్ చేస్తూ పుష్ప 2 టీంకి సపోర్ట్ చేశాడు.
అయితే అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో చూడటానికి వచ్చాడు. దీంతో అభిమానులు థియేటర్ కి పోటెత్తారు. ఈ క్రమంలో అభిమానులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీలకి పని చెప్పాల్సి వచ్చింది.
పుష్ప 2 ప్రీమియర్ షోలో శిల్పా రవిచంద్రా రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024
అల్లు అర్జున్ కోసం సంధ్య థియేటర్‌కు వచ్చిన శిల్పా రవిచంద్రా రెడ్డి https://t.co/dCpenVWPJt pic.twitter.com/mK2EcEQGuT
సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ కోసం శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి థియేటర్ కి వచ్చాడు. ఇది గమనించిన అభిమానులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేగాకుండా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేయడానికి వచ్చిన శిల్ప రవీంద్ర రెడ్డిని అభినందిస్తున్నారు.
అభిమానులతో కలిసి సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ https://t.co/7CMYbIh4Lk pic.twitter.com/3BB2jlvinw
— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024
ఈ విషయం ఇలా ఉండగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో శిల్ప రవీంద్ర రెడ్డి వైకాపా తరుపున నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశాడు. దీంతో అల్లు అర్జున్ స్నేహం కోసం శిల్ప రవీంద్ర రెడ్డి తరుపున ఎన్నికల్లో ప్రచారం చేశాడు. కానీ అనుకోకుండా శిల్ప రవీంద్ర రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయాడు. దీంతో కొందరు అభిమానులు, మెగా హీరోలు అల్లు అర్జున్ పై నెగిటివ్ ట్రోలింగ్ కి పాల్పడ్డారు.