Pushpa2: The Rule : మొదలైన సందడి..పుష్ప 2 కి వైసీపీ నాయకుల సపోర్ట్..

Pushpa2: The Rule : మొదలైన సందడి..పుష్ప 2 కి వైసీపీ నాయకుల సపోర్ట్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. దీంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీ ఎత్తున కటౌట్లు, అభిషేకాలు అంటూ హంగామా షురూ చేశారు. అయితే ఇప్పటివరకూ ఇండస్ట్రీ నుంచి మాత్రం అల్లు అర్జున్ పుష్ప2 కి సపోర్ట్ గా సోషల్ మీడియాలో పెద్దగా సపోర్ట్ లభించలేదని చెప్పాలి. కానీ ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ అనునిత్యం అండగా నిలుస్తున్నారు.

అయితే గతంలో ఏళ్లుగా ర్జున్ వైసీపీ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని కొందరు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ చెయ్యడం మొదలుపెట్టారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా అల్లు అర్జున్ కి అండగా నిలబడతామంటూ పోస్ట్లు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పుష్ప 2 టీమ్ ని స్పోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. 

ఇందులోభాగంగా ""పుష్ప-2" తెలుగు వారికి పేరు తేవాలి !" అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు స్పందిస్తూ పుష్ప 2 టీమ్ కి సపోర్ట్ చేసినందుకు థాంక్స్ చెబుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు కూడా సోషల్ మీడియా ద్వారా పుష్ప టీం కి విషెస్ తెలుపుతున్నారు.

నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవీంద్ర రెడ్డి కూడా సోషల్ మీడియాద్వారా స్పందించాడు. ఇందులోభాగంగా ఫైర్ ఏమోజీస్ షేర్ చేస్తూ పుష్ప 2 టీంకి సపోర్ట్ చేశాడు.

ఇక పలు చోట్ల అల్లు అర్జున్ అభిమానులు థియేటర్లవద్ద సందడి మొదలెట్టేశారు. ఈ క్రమంలో  పుష్ప-2 గెటప్ లో అల్లు అర్జున్ అభిమాని సందడి చేశాడు. టెక్కలిలోని భవానీ థియేటర్లో అల్లు అర్జున్ అభిమాని ఒకరు అమ్మవారి గెటప్ వేసి సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.