పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైసీపీ..

2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కి సమయం ముంచుకొస్తోంది. మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి చుక్కెదురైన సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.

పోస్టల్ బ్యాలెట్ పై రిటానింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, సీల్, హోదా వంటివి వివరాలు పొందుపరచాల్సిన అవసరం లేదని తెలిపింది ఈసీ. కేవలం ఏపీకి మాత్రమే ఈ వెసలుబాటు కల్పించింది ఈసీ. దీన్ని వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కార్ న్యాయపోరాటం చేస్తోంది.ఈ అంశంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం.

Also Read:ఏపీలో ఆ పార్టీకే అధికారం.. టైమ్స్ నౌ ఈటీజీ

ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ సుప్రీం  కూడా హైకోర్టు తీర్పును సమర్దిస్తే ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలినట్టే అవుతుంది. మరి, కౌంటింగ్ వేళ కీలకంగా మారిన ఈ అంశంపై సుప్రీం ఎలా స్పందిస్తుందో చూడాలి.