వైసీపీకి మరో షాక్: జనసేనకే పీఏసీ చైర్మెన్ పదవి..

వైసీపీకి మరో షాక్: జనసేనకే పీఏసీ చైర్మెన్ పదవి..

ఏపీ అసెంబ్లీ వేదికగా గురువారం ( నవంబర్ 21, 2024 ) అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పీఏసీ చైర్మెన్ పదవికి చివరి నిమిషంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు చేయటంతో కాసేపు హైడ్రామా నడిచింది. అయితే.. అసెంబ్లీలో వైసీపీకి సంఖ్యా బలం లేకపోవటంతో పీఏసీ చైర్మెన్ పదవి దక్కలేదు.ఈ క్రమంలో జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. జనసేన నుంచి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేరును ప్రతిపాదించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో పీఏసీ చైర్మెన్ గా పులపర్తి రామాంజనేయులు ఎన్నికవ్వడం లాంఛనమే అని చెప్పాలి.

ALSO READ | చంద్రబాబు.. తల్లిదండ్రులకు ఏనాడైనా రెండు పూటలా భోజనం పెట్టావా: జగన్ సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీలో పీఏసీ చైర్మెన్ పదవి దక్కాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. అయితే.. ఈ పదవిని ప్రతిపక్షానికి కేటాయించటం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం, ప్రతిపక్ష హోదా లేకపోవటంతో ఈ పదవి జనసేనకు దక్కింది.

కాగా.. ఈ పదవికి పెద్దిరెడ్డి సహా పీఏసీ సభ్యుల స్థానాలకు మరో 3 ఎమ్మెల్సీలు కూడా నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో బలం లేకపోయినా వైసీపీకి కౌన్సిల్ లో బలం ఉంది కాబట్టి.. పీఏసీ కమిటీలో ఇద్దరికీ స్థానం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.