హైదరాబాద్ ఆకాశ వీధుల్లో విమానం నడిపిన వైసీపీ నేత కేతిరెడ్డి..!

హైదరాబాద్ ఆకాశ వీధుల్లో విమానం నడిపిన వైసీపీ నేత కేతిరెడ్డి..!

అనంతపురం: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పైలట్గా మారి విమానం నడిపారు. ఆకాశంలో విహరిస్తూ హైదరాబాద్ అందాలను వీక్షించారు. ప్రైవేట్ జెట్ నడిపిన అనుభవాన్ని ఆయన తన ‘ఎక్స్’ వేదికగా వీడియో పోస్ట్ చేసి నెటిజన్లతో పంచుకున్నారు. కలలను నిజం చేసుకున్న తరుణం ఇదని.. అఫిషియల్లీ పైలట్గా విమానం నడిపానని పోస్ట్ చేశారు. తన ఫస్ట్ సోలో ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇదేనని కేతిరెడ్డి ‘ఎక్స్’లో తన అనుభూతిని పంచుకున్నాడు. 2009లో వైఎస్సార్ నాయకత్వంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ధర్మవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Also Read:-కొడాలి నాని గుండెకు స్టెంట్ లేదా బైపాస్ సర్జరీ తప్పదన్న వైద్యులు

‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమంలో ఆయన ప్రజలతో సంభాషించిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యాయి. ఇన్ స్టాగ్రాంలో రీల్స్ చేసేంతలా ఆయన మాటలు ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కేతిరెడ్డి ఓడిపోయారు. ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ.. ఆ పుకార్లను కేతిరెడ్డి కొట్టిపారేశారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ వెంటే ఉంటానని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.