ఏపీలో ఘోరం: నరికితే రెండు చేతులు రోడ్డుపై తెగిపడ్డాయి

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై వైసీపీ యువనేత హత్య రాష్ట్రంలో కలకలం రేపింది.నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే  రెండు చేతులు నరికి కిరాతకంగా హత్య చేశాడు దుండగుడు. వివరాల్లోకి వెళితే, పల్నాడు జిల్లా వినుగొండ వైసీపీ యువజన విభాగం నాయకుడు రషీద్ పై దాడి చేసి కిరాతకంగా చంపేశాడు షేక్ జిలాని. అందరూ చూస్తుండగానే రెండు చేతులు, మెడ నరికి పాశవికంగా చంపేశాడు జిలాని. రెండు చేతులు తెగిపోయి, మెడకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో కుప్పకూలి చనిపోయాడు రషీద్.

ఈ దారుణ ఘటనతో వినుకొండలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.కాగా, రషీద్ పై దాడికి పాల్పడ్డ జిలాని టీడీపీ కార్యకర్తగా తెలుస్తోంది. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

నిందితుడు జిలానీని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ను తరలించారు. రషీద్ హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లింది వైసీపీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడాలని, దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరింది.