అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. జగన్ సహా ఎమ్మెల్యేలంతా నల్ల కండువాలతో సభకు హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ స్లోగన్స్ ఇచ్చారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని.. 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయని నినాదాలు చేశారు. అనంతరం వైసీపీ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు.

Also Read:- నల్లకండువాలతో అసెంబ్లీకి జగన్