వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అరెస్ట్ : మాజీ ఎంపీ సురేష్ కు 14 రోజుల రిమాండ్

వైఎస్ఆర్‌సీపీకి చెందిన ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి, చంద్రబాబునాయుడు ఆఫీసుపై దాడి వ్యవహారంలో నిందితులుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని అరెస్ట్ చేయగా.. మాజీ ఎంపీ నందిగం సురేష్​ కు 14 రోజులు రిమాండ్​ విధించారు.  

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో  వైసీపీ ఎమ్మెల్సీ  లేళ్ల అప్పిరెడ్డిని బెంగళూరులో అరెస్ట్​ చేశారు .  ఈరోజు( సెప్టెంబర్​ 5)  అప్పిరెడ్డిని మంగళగిరి తరలిస్తున్నారు.  అలానే ఈ రోజు (సెప్టెంబర్​ 5)న హైదరాబాద్​ లో అరెస్ట్​ చేసి మాజీ ఎంపీ నందిగం సురేష్​ కు 14 రోజులు విధించారు.  సురేష్​ను గుంటూరు జైలుకు తరలిస్తున్నారు.

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. బుదవారం( సెప్టెంబర్​ 4)  ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో అరెస్ట్​ చేశారు.   బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ ఉద్దండరాయుని పాలెంలోని నివాసంలో అందుబాటులో లేకపోవడంతో ఆయన అచూకీ కోసం గాలించారు. హైదరాబాద్ మియాపూర్‌లో ఉన్నట్టు గుర్తించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో అరెస్ట్‌ చేశారు. సురేష్‌ను హైదరాబాద్‌ నుంచి మంగళగిరి తరలించి ..విచారణ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. 

ఏం జరిగిందంటే….

వైసీపీ నాయకులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లను ఏపీ హైకోర్టు బుధవారం రిజెక్ట్‌ చేసింది. చంద్రబాబు నివాసంపై దాడి విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో వైసీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి సహా ఇతర నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ రెండు ఘటనల్లో నిందితులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ పూర్తైన నేపథ్యంలో తాజాగా వారి పిటిషన్లను రిజెక్ట్‌ చేస్తున్నట్టు హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీం కోర్టు సూచనల ప్రకారం నిందితులపై రెండు వారాల పాటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని వైసీపీ నేతలు అభ్యర్థించారు. రెండు వారాల పాటు గడువు ఇచ్చే అంశాన్ని మధ్యాహ్నం పరిశీలిస్తామని హైకోర్టు పిటిషనర్లకు తెలిపింది. ఆ తర్వాత పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం వాటికి తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు.

ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైసీపీ నాయకులు దేవినేని అవినాశ్, నందిగం సురేష్, ఆ పార్టీ కార్యకర్తలు జి.రమేష్‌, షేక్ రబ్బానీ భాషా, చిన్నాబత్తిన వినోద్ కుమార్‌ సహా మరికొందరికి బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు  నిరాకరించింది. మరోవైపు మాజీ మంత్రి జోగిరమేష్‌ను కూడా అరెస్ట్ భయం వెంటాడుతోంది. చంద్రబాబు విపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ఇంటిపై జరిగిన దాడి కేసులో జోగి రమేష్‌తో పాటు 13మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.