కూటమి ప్రభుత్వం కావాలనే జగన్‌ను ఇబ్బంది పెడుతోంది: బొత్స

కూటమి ప్రభుత్వం కావాలనే జగన్‌ను ఇబ్బంది పెడుతోంది: బొత్స

జగన్ భద్రతపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటనకు ప్రభుత్వం భద్రత కల్పించకపోవడంపై ఫిర్యాదు చేశారు బొత్స. ప్రభుత్వం కావాలనే జగన్‌ను ఇబ్బంది పెడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు బొత్స. జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించడంలేదని.. కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయడంలేదని అన్నారు బొత్స. ఈసీ కోడ్‌కు జగన్‌ భద్రతకు సంబంధంలేదని,ముందస్తు సమాచారం ఇచ్చే గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లామని.. అయినా ప్రభుత్వం భద్రత కల్పించలేదని అన్నారు బొత్స.

మాజీ సీఎంగా జగన్‌కు జెడ్‌ప్లస్‌ సెక్యూరిటీ వర్తిస్తుందని అన్నారు బొత్స. ప్రభుత్వం కుట్ర తమకు తెలుసని..  జెడ్‌ప్లస్ భద్రత ఉన్న జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఉండాలని అన్నారు. కానీ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనలో మాత్రం ఒక్క కానిస్టేబుల్ కూడా లేడని ఆరోపించారు బొత్స. 

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భద్రత విషయంలో చంద్రబాబును ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని అన్నారు. జగన్ కు వర్తించిన ఎన్నికల కోడ్, టీడీపీ నిర్వహించిన మ్యూజికల్ నైట్‌కు వర్తించదా అంటూ ప్రశ్నించారు బొత్స. జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రత ఉన్న వ్యక్తికి ఎన్నికల కోడ్ తో సంబంధం ఉండదని.. ప్రభుత్వం ఈ విషయంలో కావాలనే రాజకీయం చేస్తోందని మండిపడ్డారు బొత్స.