గత ప్రభుత్వం హయాంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మంగళగిరి పోలీసులు పలువురు వైసీపీ నేతలకు విచారణకి హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారు. కానీ నోటీసులు అందుకున్న వైసీపీ నేతలు మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు.
కానీ.. ఈరోజు వైసీపీ నేతలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాశ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈక్రమంలో వీరిరువురు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వారి వెంట న్యాయవాది గవాస్కర్ కూడా ఉన్నారు.
ఈ క్రమంలో పోలీసులు మూడు గంటలపాటూ విచారణ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విచారణలో భాగంగా పోలీసులు అన్ని కోణాల్లో వారిని ప్రశ్నలు అడిగినప్పటికీ వైసీపీ నేతలనుంచి సరైన సమాధానాలు రానట్లు సమాచారం.