ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. గురువారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ప్రధాన పార్టీలంతా కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేస్తుండటంతో ఆర్వో కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కడప మేయర్ సురేష్ బాబు, ఇతర వైసీపీ నేతలతో వెళ్లి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు అవినాష్.
ఈసారి ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వైఎస్సార్ కూతురు, జగన్ సోదరి షర్మిల అవినాష్ కు పోటీగా 9బరిలోకి దిగటమే ఇందుకు కారణం. వివేకా హత్య కేసును ప్రధాన అంశంగా తీసుకొని జగన్, అవినాష్ లపై విమర్శలు సంధిస్తున్న క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా కడపలో హోరాహోరీ పోటీ నెలకొంది. మరి, కడప నుండి రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన అవినాష్ రెడ్డి ఈసారి కూడా గెలుపొంది హ్యాట్రిక్ సాధిస్తాడా లేదా చూడాలి.