
ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సిట్ విచారణ ఈ రోజు ( ఏప్రిల్ 19) ముగిసింది. ఏడుగంటలపాటు విచారించిన సిట్ అధికారులు ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. పలు అంశాలపై మిథునరెడ్డికి ప్రశ్నల వర్షం కురిపించి.. కీలక సమాచారాన్ని రాబట్టారని సమాచారం అందుతోంది. ఈ వ్యవహారంలో ఆయనను మళ్లీ సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉంది.
వైసీపీ ఎంపీ మిథున రెడ్డిని కోర్టు ఆదేశాల మేరకు ఆయన న్యాయవాది సమక్షంలో విచారించారు. రాజ్ కసిరెడ్డి ఆడాన్ డిస్టిలరీపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం అందుతోంది. ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ఎంత మేరకు కొనుగోళ్లు చేసిందని ప్రశ్నించారు. రాజ్ కసిరెడ్డితో ఉన్న ఆర్థికలావాదేవీల గురించి ఆరాతీశారు.