కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీలు కూడా ముఖ్యమే : విజయసాయిరెడ్డి

కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలు ఎంత అవసరమో, వైసీపీ ఎంపీలు కూడా అంతే అవసరమన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. రాజ్యసభలో ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీల మద్దతు అవసరం ఉంటుందన్నారు.  దేశ, రాష్ట్ర ప్రయోజనాలను బట్టి కేంద్రం తీసుకువచ్చే బిల్లులకు వైసీపీ ఎంపీల మద్దతుంటుదన్నారు. ఈ విషయాన్ని ప్రధానిమోదీ గ్రహించాలన్నారు విజయసాయిరెడ్డి. ఇక పార్టీ ఓటమిపై విజయసాయరెడ్డి మాట్లాడుతూ ప్రజా తీర్పుని అన్ని పార్టీలు అంగీకరించాలని, ఎన్డీఏ లేదా ఇండియా కూటమికి వచ్చిన ఓట్లు, సీట్లను కూడా ప్రజాతీర్పులో భాగంగానే చూస్తామని తెలిపారు ఏపీ ఎన్నికల్లో వైసీపీ వైఫల్యంపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టు చెప్పారు. ఒక్క వైసీపీతో తప్ప చంద్రబాబు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే విజయం సాధించారని విమర్శించారు.