
భద్రాచలం, వెలుగు: ఆంధ్రాలో విలీనమైన అల్లూరి జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం వైసీపీకి చెందిన ఎంపీటీసీ వర్సా బాలకృష్ణ(40) గురువారం అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యారు. రాజకీయ కక్షల కారణంగానే బాలకృష్ణను హతమార్చినట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన రాజకీయ తగాదాల నేపథ్యంలో అతనిని దారికాచి ఓ ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా కన్నాయిగూడెం గ్రామ సమీపంలో దాడి చేశారు. అతడి తలపై బండరాయితో కొట్టి చంపేశారు. కృష్ణను హత్య చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్, గోండ్వాన సంక్షేమ పరిషత్నాయకులు డిమాండ్ చేశారు. ఎటపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.