ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీఎం జగన్ పై రాయి దాడి ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేసి అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో ఈ కేసు విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో ఒకడైన వడ్డెర యువకుడు సతీష్ సీఎంపై దాడి చేసింది తానేనని ఒప్పుకోగా, ఈ దాడి వెనుక టీడీపీ నేత బోండా ఉమా హస్తం ఉందని ఆరోపిస్తున్నారు వైసీపీ శ్రేణులు.
ఇదిలా ఉండగా సీఎంపై జరిగిన దాడికి, తనకు ఎటువంటి సంబంధం లేదని, వైసీపీ నాయకులూ ఉద్దేశపూర్వకంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తన మనిషి దుర్గారావుకు ఈ దాడితో సంబంధం లేదని. దుర్గారావు తన ఆఫీసులో పని చేస్తాడని, రోజు తనకు ఫోన్ చేసి షెడ్యూల్ గురించి చెప్తుంటాడని అన్నారు. ఈ కేసులో అన్యాయంగా తనను ఇరికిస్తే జూన్ 4 తర్వాత వైసీపీ నాయకులను వదిలిపెట్టనని అన్నారు.