ఉప్పొంగిన ఏలేరు డ్యామ్.. నీట మునిగిన 25గ్రామాలు..

ఉప్పొంగిన ఏలేరు డ్యామ్.. నీట మునిగిన 25గ్రామాలు..

భారీ వర్షాలు, వరదలు ఏపీని వణికిస్తున్నాయి. విజయవాడ వరదలు మిగిల్చిన విషాదం నుండి బయటపడక ముందే మరో విపత్తు వచ్చి పడింది. ఏలేరు డ్యామ్ ఉప్పొంగడంతో 8 చోట్ల గండి పడి 25గ్రామాలూ నీటమునిగాయి. ఏలేరు డ్యామ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరిన క్రమంలో అధికారులు గేట్లు ఎత్తారు.రిజర్వాయర్ ప్రధాన కాలువ అయిన గొర్రిఖండి సహా 8చోట్ల గండి పడటంతో అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

25 గ్రామాల్లో జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో చాలా చోట్ల రాకపోకలను నిలిచిపోయాయి. గొల్లప్రోలు టోల్‌ప్లాజా మీదుగా పిఠాపురం-చేబ్రోలు మధ్య జాతీయ రహదారి మోకాళ్ల లోతుకు పైగా నీటితో నిండిపోయింది.ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఇండియన్ ఆర్మీ సహా స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

రోడ్డు మార్గంలో భారీ వాహనాలను మాత్రమే అనుమస్తున్నారు. అవసరమైన చోట సహాయక చర్యలు అందించేందుకు రెస్క్యూ టీమ్స్ ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. చాలా చోట్ల రోడ్లు, పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కిర్లంపూడిలో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.