
వేములవాడ రూరల్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్నగర్ రిజర్వాయర్ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నీరు శనివారం చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వేసవిలో సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు కాకుండా లింక్ చెరువులకు కెనాల్ ద్వారా నీటిని వదిలినట్లు వారు తెలిపారు.
ఎండాకాలంలో రైతుల బోరు బావులు, పొలాలు భూగర్భ జలాలు ఎండిపోకుండా ముందస్తుగా నీటి విడుదల చేశామన్నారు. ఆయా గ్రామాల్లో చెరువులు కుంటలు నింపుతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సోయినేని కరుణాకర్, రోమాల ప్రవీణ్, దానె కొమురయ్య, వంగ మల్లేశం, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.