మూడు రోజుల్లో గోదావరికి టెండర్లు

మూడు రోజుల్లో గోదావరికి టెండర్లు
  • రూ.7,360 కోట్లతో ఫేజ్–2, 3 ప్రాజెక్టు
  • మూడు కాంపొనెంట్లుగా ప్రాజెక్టు
  • రెండేండ్లలో కంప్లీట్ చేయడానికి ప్లాన్ 
  • ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చిన సర్కార్


హైదరాబాద్ సిటీ, వెలుగు:గ్రేటర్ అవసరాలకు ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి గోదావరి ఫేజ్–1 ద్వారా నీటిని అందించే మెట్రోవాటర్ బోర్డు త్వరలో రెండోదశ, మూడోదశ పనులను చేపట్టబోతోంది. రూ.7,360కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులకు రెండు, మూడు రోజుల్లో టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం క్లియరెన్స్ కూడా ఇచ్చింది. ఈ ప్రాజెక్టును రెండేండ్లలో పూర్తిచేసి ఒక్కో దశ నుంచి 150 చొప్పున మొత్తం 300 ఎంజీడీలను అందించనున్నారు. 


గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్ వరకు విస్తరిస్తున్న నేపథ్యంలో అవసరాలకు తగ్గట్టు తాగునీరు సరఫరా చేయడానికి నీటి బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఓఆర్ఆర్పరిధిలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరందిస్తున్న సంస్థ.. గోదావరి ప్రాజెక్టు పూర్తయితే అన్ని ప్రాంతాలకు డిమాండ్ తగ్గింది. అందించబడినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే గోదావరి ఫేజ్–2, 3 ప్రాజెక్టులకు ప్లాన్ చేసింది. 

మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు

గోదావరి రెండు, మూడో దశ ప్రాజెక్టు పనులను మూడు కాంపొనెన్‌లుగా విభజించి పనులు చేపట్టనున్నారు. రూ.4,671 కోట్లతో చేపట్టబోయే కాంపోనెంట్–1లో మల్లన్నసాగర్‌నుంచి 20 టీఎంసీల రా వాటర్‌తరలించనున్నారు. ఇందులో 15 టీఎంసీలు తాగడానికి, మరో 5 టీఎంసీలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లో నిల్వ చేసి మూసీ ప్రక్షాళనకు ఉపయోగించనున్నారు. దీని కోసం రెండు లెన్లలో 3,000 డయా పైప్‌లైన్ 50 కి.మీ, 58 కి.మీ., 2,200 డయా పైప్‌లైన్ నిర్మించబడుతుంది. ఘనాపూర్వద్ద 1,170 ఎంఎల్డీ కెపాసిటీ ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడతారు. 

దీనికి సంబంధించి ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఇతర నిర్మాణాలను మల్లన్న సాగర్ వద్ద కట్టనున్నారు. కాంపొనెంట్–2కు రూ. 596.88 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఇందులో భాగంగా ఘనాపూర్‌నుంచి ముత్తంగి వరకు 2400 ఎంఎం డయా పైప్‌లైన్‌నిర్మిస్తారు. ఇది 40 వరకు ఉంటుంది. 

మొత్తంగా ఇప్పటికే నిర్మించిన రింగ్‌మెయిన్‌కు 3000 ఎండెయా పైప్‌లైన్‌ఇంటర్‌కనెక్ట్ చేస్తారు. కాంపొనెంట్–3కి రూ.300.09 కోట్లు కాగా, ఇందులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద 120 ఎంఎల్‌డీ కెపాసిటీ ఉన్న వాటర్‌ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ని నిర్మిస్తుంది. హిమాయత్‌సాగర్‌ వద్ద 70 ఎంఎల్‌డీ కెపాసిటీ ఉన్న మరో డబ్ల్యూటీపీని నిర్మించారు. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ మధ్య ఇంటర్‌కనెక్షన్‌ ఏర్పాటు చేసి వాటిని అనుసంధానిస్తారు. ఇవి కాకుండా ఇతర పనులకు రూ.1,791 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.