గెలుపోటములను శాసించేది గిరిజనేతరులే : బాదావత్ ప్రతాప్

ఇల్లెందు, వెలుగు: బీఎస్పీతోనే బహుజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఇల్లెందు నియోజకవర్గ ఇన్​చార్జ్ బాదావత్ ప్రతాప్ చెప్పారు. బుధవారం బొజ్జయిగూడెంలోని సమ్మక్క-సారలమ్మ గద్దెల ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఇల్లెందులో గెలిచిన నేతలంతా అభివృద్ధి పేరుతో పార్టీ మారినోళ్లే తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.

ఇల్లెందులో గెలుపోటములను శాసించే సత్తా గిరిజనేతరులకే ఉందని, వారంతా బీఎస్పీ అభ్యర్థికి ఓటేయాలని కోరారు. రెండు పర్యాయాలు కాంగ్రెస్​నుంచి గెలిచిన నేతలు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడిన విషయం గుర్తుచేశారు. అధిష్టానం ఆదేశిస్తే ఇల్లెందు బీఎస్పీ అభ్యర్థిగా తాను పోటీలో ఉంటానని తెలిపారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి బీఎస్పీ ప్రచార రథాన్ని ప్రారంభించారు.