కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఆయన పీఏ అరీఫ్ కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఎమ్మెల్యే హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యేకు రామరెడ్డి మండలంకు చెందిన ఒక సర్పంచ్ ద్వారా కరోన సోకినట్లు సమాచారం.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి జాజాల ఆ పార్టీలోనే ఉన్నారు. ఆయన 2004లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. దాంతో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2014లో మాత్రం కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. అయినా కూడా ఆయనను గెలుపు వరించలేదు. వరుసగా మూడుసార్లు ఓడిపోవడంతో.. నియోజకవర్గ ప్రజల్లో ఆయనపై సానుభూతి ఏర్పడింది. దాంతో 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
For More News..