
సదాశివనగర్, వెలుగు: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గురువారం సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో సొసైటీ నూతన భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతుబీమా, రైతు భరోసా వంటి పథకాలతో అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి, వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, సీఈవో కడెం బైరయ్య, సీడీసీ చైర్మన్ ఇర్షాద్ పాల్గొన్నారు.
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
మహనీయుల చర్రితను తెలుసుకుని వారిని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ర్ట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు యువతకు సూచించారు. గురువారం సదాశివనగర్ మండల కేంద్రం లో ర్యాలీ నిర్వహించి బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రమాబాయి విగ్రహాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంగారెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు లింగాగౌడ్, ఏఎంసీ చైర్మన్ సంగ్యానాయక్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు భాగయ్య, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.