రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తాం : ఎల్లారెడ్డి ఆర్టీఓ మన్నెప్రభాకర్​

  రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తాం : ఎల్లారెడ్డి ఆర్టీఓ మన్నెప్రభాకర్​

లింగంపేట,వెలుగు:  లింగంపేట గ్రామ పంచాయతీకి చెందిన లేఅవుట్​ భూములను మంగళవారం ఎల్లారెడ్డి ఆర్టీఓ మన్నె ప్రభాకర్​ పరిశీలించారు. సర్వేనంబర్​1074లోని 600ల గజాల లేఅవుట్​స్థలాన్ని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారని ఆరోపి స్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో కలెక్టర్​ విచారణకు ఆదేశించారు. కలెక్టర్​ఆదేశాల మేరకు లేఅవుట్​భూములను ఆర్డీఓ పరిశీలించారు.

600 గజాల లేఅవుట్​ భూమిచుట్టూ మత్తడి పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు రేకుల కంచెను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ లేఅవుట్​ భూమిని వెంటనే పంచాయతీ ఆధీనంలోకి  తీసుకోవాలనీ, ఇది గ్రామపంచాయతీ స్థలం అని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని  సెక్రటరీ శ్రావణ్​​కుమార్​ను ఆదేశించారు. లేఅవుట్​ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేయించుకున్న వారి వివరాలను సేకరించి రిజిస్ట్రేషన్ల రద్దు కోసం  తహసీల్దార్​కు ఫిర్యాదు చేయాలని సూచించారు.  

తహసీల్దార్​ సిఫారసు మేరకు తాను అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసేందు కు కలెక్టర్​కు నివేదిక అందజేస్తానని  చెప్పారు. గ్రామపంచాయతీ లేఅవుట్​ భూమి కబ్జాలపై గ్రామస్తులు ఆందోళన చేయడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగడంపై స్థానికులు  హర్షం వ్యక్తం జేస్తున్నారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్​నరేందర్, ఎంపీఓ మలహరి, పంచాయతీ సెక్రటరీ శ్రావణ్​​కుమార్​ తదితరులు ఉన్నారు.