- హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సిటీలో మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం భారీ వర్షం పడొచ్చని పేర్కొంటూ.. ఎల్లో అలెర్ట్(6.4 నుంచి 11.5 సెంమీ.ల వాన పడే అవకాశం) జారీ చేశారు. శనివారం గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా బండ్లగూడలో 1.3 సెం.మీల వర్షం పడింది. కూకట్పల్లి, బన్సీలాల్ పేట, సరూర్నగర్
ప్రాంతాల్లో తేలికపాటి వాన పడింది.