హైదరాబాద్, వెలుగు: సిటీలో పలు ప్రాంతాల్లో ఆదివారం వాన పడింది. సాయంత్రం 5 గంటలకు మేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ లో అధికంగా 2.60, జీడిమెట్లలో 2.58, ఉప్పల్ లో 1.3, గాజులరామారం 1.20 సెం.మీ పడింది.
మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. సోమ, మంగళ వారాల్లో భారీ వర్షాలు(6.4 సెం.మీ నుంచి 11.5 సెం.మీ కురిసే చాన్స్) ఉన్నట్లు హెచ్చరించారు. రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీచేశారు.