
- బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ
వర్ని, వెలుగు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌బోర్డు సవరణ చట్టం ముస్లింలకే లాభమని బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహించిన గావ్‌చలో బస్తీ చలో కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో 2006 లో వక్ఫ్‌బోర్డు ఆదాయం రూ.12 వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.163 కోట్ల ఆదాయం చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వక్ఫ్‌బోర్డు లో నెలకొన్న అవినీతిని ప్రక్షాళన చేసేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు సవరణ చట్టం తీసుకొచ్చిందన్నారు. రుద్రూర్ లోని అంగడిబజార్లోని అంబేద్కర్ విగ్రహానికి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్‌గౌడ్, మండలాధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి వడ్లసాయినాథ్, బీసీ మోర్చా అధ్యక్షుడు సతీష్పవర్ తదితరులు పాల్గొన్నారు.